Friday, March 24, 2017

క్షీర సంభవ మహాలక్ష్మీ మంగళ హారతి!!

ఈటీవీ  తెలుగు భాగవతం సీరియల్ నుండీ
క్షీర సంభవ మహాలక్ష్మీ మంగళ హారతి!!




మా  రమా అమ్మా రావమ్మా!!

మా  రమా అమ్మా రావమ్మా!!
మంగళాంగి  మా  మనుగడనీవమ్మా!!

సురాసురాసులు కీర్తింపా
సిరి సిరి నవ్వులు దీపింపా
సర్వ సమృద్ధులు ఇల నింపా
శ్రీ  శియంకరి రా రమేశ్వరి మా మనోహరి జనియించే!!

ఆర్ణవమందున స్వర్ణ జలేజము ఆది లక్ష్మి మణి పీఠము కాగా!!
వెలసె త్రైలోక్య కుటుంబినిగా వెడలె మా తల్లి గజ లక్ష్మి గా!!

గగన భువనముల ఘన తాళముల
అష్ట దిక్కరుల అభిషేకముల
హరిత శాలికల సరి తోరణల
కనక రజితమయ ఘన వేదికల

నవ రత్నమ్ముల దివ్య హారతుల
మధు మకరందపు తల అంటులతో
పసిడి పాదరసముల నలుగులతో
తరళ తారకల తల పువ్వులతో
వెలుగుతున్న మా బంగరు బొమ్మా!!

మా  రమా అమ్మా రావమ్మా!!
మంగళాంగి  మా  మనుగడనీవమ్మా
మా  రమా అమ్మా రావమ్మా!!

సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మహలక్ష్మీ పాలయమాం  వరలక్ష్మీ పాలయమాం!!

క్షీర సముద్భవ  మంగళ రూపిణి  మంత్ర నివాసిని మంత్రనుతే
ధనలక్ష్మీ పాలయమాం  ధాన్యలక్ష్మీ పాలయమాం!!

జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే
ధైర్యలక్ష్మీ పాలయమాం విజయలక్ష్మీ పాలయమాం!!

సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే
సంతానలక్ష్మీ పాలయమాం  సౌభాగ్యలక్ష్మీ పాలయమాం!!

ధిమి ధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ఘుమ ఘుమ ఘుoఘుమ ఘుoఘుమ ఘుoఘుమ శంఖ నినాద సువాద్యనుతే
మహలక్ష్మీ పాలయమాం  వరలక్ష్మీ పాలయమాం!!

మహలక్ష్మీ పాలయమాం  వరలక్ష్మీ పాలయమాం!!
మహలక్ష్మీ పాలయమాం  వరలక్ష్మీ పాలయమాం!!
మహలక్ష్మీ పాలయమాం  వరలక్ష్మీ పాలయమాం!!

జయోస్తు సిరి గల తల్లికీ
శ్రీ రస్తూ శ్రీ రమకి
శుభమస్తూ కళ్యాణమస్తూయని దీవించగా

నారద తుంబుర బృంద వంది గళ మంగళ నాదాశీస్సులతో
ముక్కోటి దేవతలూ ఋషులూ నిగమపు సేసలు చల్లగా

వరించే సిరి తన వరునిగా హరిని మోహనాకారునీ
గ్రహించే హరి శ్రీకరముగా సతి శ్రీకరము నిగమ విధినీ

శుభమస్తూ కళ్యాణమస్తు
శుభమస్తూ కళ్యాణమస్తు !!

 

No comments:

Post a Comment