రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహార రణ ధీరా
రథాంగ ధర ఘన పతంగ వాహన రమా రమణ నారాయణా
దశరథ రామ కోసల రామ జానకి రామ జయ రామ
హనుమత్సేవిత సుందర సురుచిర శ్రీ శుభ నామ జయ ధామ 1
వాలి గర్వ హర వారిధి బంధన వారిజాక్ష హే శ్రీ రామ
విభీషణార్చిత మంగళ చరణ వానర సేవిత జయ రామ 2
ఇన కుల రామ జయ రఘు రామ తాటక భంజక జయ రామ
ఈశ్వర ప్రేరిత గిరిజా సేవిత మంగళ నామా శ్రీ రామా 3
సీతా నాయక శ్రిత పరిపాలక వర శుభ నామా జయ రామ
ఖర దూషణాది దైత్య విరామ వీర రామ హే శ్రీ రామా 4
రావణ సంహర పాలన తత్పర దనుజ విరామా శుభ నామా
శబరీ గుహ సేవిత శ్రీ సీతా లక్ష్మణ సహితా జయ రామా 5
వర సుగ్రీవాభీష్టద రామా సుగుణ ధామ జయ రఘు రామా
భరత శతృఘ్న సదారాధితా హసిత ముఖాoబుజ శ్రీ రామ 6
ఏక పత్ని వ్రత ఏక స్వరూపక ఈశ చాప హర జయ రామా
ధరా పుత్రి మన్మందిర సుందర శృంగార రామా శుభ నామా 7
పీతాంబర ధర నీరద శ్యామల దివ్య శరీరా శ్రీ రామా
భార్గవ దర్ప వినాశక రామా విజయ రామ వర గుణ ధామా 8
అయోధ్య పాలక ధర్మ స్థాపక పట్టాభిరామా జయ రామా
వికుంఠ విలసిత విరించి సేవిత వేంకట రామా శ్రీ రామా 9
త్యాగరాజ కృతి
నీ నామ రూపములకూ నిత్య జయ మంగళం !!
1. పవమాన సుతుడు బట్టు పాదారవిందములకూ
2. నవ ముక్త హారమూలు నటియించే ఉరమునకునూ
3. నళినారి గేరు చిరూ నవ్వూ గల మోమునకునూ
4. పంకజాక్షీ నెల కొన్నా నీ అంగ యుగమునకునూ
5. ప్రహ్లాద నారదాది భక్తూలూ పొగడుచుండే
6. రాజీవ నయన త్యాగరాజాది వినుతమైనా
Thank you very much
ReplyDelete