Friday, March 24, 2017

శ్రీ వేంకటాచల మాహాత్మ్యం - గోవింద నామములలో !!

"ఓం నమో వేంకటేశాయ" చలన చిత్రం నుండి


గోవిందా  హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా  హరి గోవిందా
గోకుల నందన గోవిందా

భృగు ముని పూజిత గోవిందా
భూమి యజ్ఞ ఫల గోవిందా
వికుంఠ విరక్త గోవిందా
వేంకట గిరి హిత గోవిందా
వల్మీక సుక్త గోవిందా
గోక్షీర తృప్త గోవిందా
గోపాల ఘటిత గోవిందా
వకుళా వర్థిత గోవిందా

గోవిందా  హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా  హరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా !!

మృగయా వినోద గోవిందా
మద గజ మద హర గోవిందా
పద్మా ప్రేమిక గోవిందా
పరిణయోత్సుకా గోవిందా

కుబేర కృపార్ధ గోవిందా
గురుతర రుణయుత గోవిందా
కల్యాణప్రియ గోవిందా
కల్యాణప్రియ గోవిందా
కలియుగ రసమయ గోవిందా

గోవిందా  హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా  హరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా !!

శ్రీ శైలేశా గోవిందా
శేష శైలేశ గోవిందా

శ్రీ శైలేశా గోవిందా
శేష శైలేశ గోవిందా
శ్రీ గరుడ నిలయ గోవిందా
శ్రీ వేంకట వర గోవిందా

నారాయణాద్రి గోవిందా
వృషభాద్రీశా గోవిందా
వృష పర్వతేశ గోవిందా
సప్త శైలేశ గోవిందా

సుప్రభాత రస గోవిందా
విశ్వరూప విభు గోవిందా
తోమాల రుచిర గోవిందా
నిత్య కల్యాణ గోవిందా

గోవిందా  హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా  హరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా !!

రథ సప్తమి రథ గోవిందా
తెప్పోత్సవ హిత గోవిందా
పారు వేట పటు గోవిందా
ప్రణయ కలహ చటు గోవిందా

పుష్ప యాగ యుగ గోవిందా
పుణ్య ప్రపూర్ణ గోవిందా
ఉత్సవోత్సుకా గోవిందా
ఊహాతీతా గోవిందా

బహు సేవా ప్రియా గోవిందా
భవ భయ భంజన గోవిందా
బ్రహ్మాది సేవిత గోవిందా
బ్రహ్మోత్సవ నవ గోవిందా

గోవిందా  హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా  హరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా !!

No comments:

Post a Comment